అన్నమయ్య, 2026-11-27
విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి, సేవా దృక్పథాన్ని పెంపొందించడంలో స్కౌటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నమయ్య జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కొండూరు శ్రీనివాసరాజు అన్నారు. నైతిక విలువలు, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడానికి స్కౌటింగ్ చక్కటి వేదికగా నిలుస్తుందని తెలిపారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి, సేవా దృక్పథాన్ని పెంపొందించడంలో స్కౌటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నమయ్య జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కొండూరు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. పుస్తక విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడానికి స్కౌటింగ్ చక్కటి వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు. శుక్రవారం డైట్ రాయచోటిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నమయ్య జిల్లా అసోసియేషన్ కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు నిర్వహిస్తున్న బేసిక్, అడ్వాన్స్డ్ శిక్షణా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అందించి, వారిని క్రమశిక్షణ, నైతిక విలువలు కలిగిన బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. సమాజ సేవ, సమయపాలన, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. తేదీ వరకు నిర్వహించే ఈ శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు.







