Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 25
26వ తేదీన జరగబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వర్ణ గ్రామంలో పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
26వ తేదీన జరగబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వర్ణ గ్రామంలో పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బుధవారం సాయంకాలం ఐదు గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని 2వ టౌన్ సీఐ శశికుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల నిఘా పెంచారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శశికుమార్ హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలోని పోలింగ్ బూతుల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఓటర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ శశికుమార్ స్పష్టం చేశారు.







