వరదయ్యపాలెం, వరదయ్యపాలెం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 06
వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ట, మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని వరదయ్యపాలెం ఎస్ఐ మల్లికార్జున నాయుడు సూచించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని ఆయన కోరారు.
వరదయ్యపాలెం ఎస్ఐ సూచనలు ఇవే..! వరదయ్యపాలెంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ట, మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తప్పనిసరని ఎస్ఐ మల్లికార్జున నాయుడు సూచించారు. వివిధ శాఖల అనుమతుల కోసం సింగిల్ విండో ఆన్లైన్ పర్మిషన్ సిస్టం అందుబాటులో ఉందన్నారు. ganeshutsav.net పోర్టల్లో వివరాలు నమోదు చేసి అనుమతులు పొందాలని సూచించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని కోరారు.










