కైకలూరు, 2026-11-26
కైకలూరు మండలం వదర్లపాడు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పుప్పాల కృష్ణారావును భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులకు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
కైకలూరు మండలం వదర్లపాడు గ్రామములో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో భాగంగా, కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి పుప్పాల కృష్ణారావును భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులకు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
రోడ్ షోలో ఎమ్మెల్యే కామినేని
ఈ సందర్భంగా, వదర్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రోడ్ షో ర్యాలీలో పాల్గొన్న కామినేని, సర్పంచ్ అభ్యర్థి కృష్ణారావుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.





