క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-23
పందిళ్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, సర్పంచ్ అభ్యర్థి మాచర్ల వరలక్ష్మికి మద్దతుగా టీడీపీ నాయకులు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చీరాల నియోజకవర్గ తెలుగు రైతు విభాగం అధ్యక్షులు పోలకం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో, వరలక్ష్మికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
పందిళ్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, సర్పంచ్ అభ్యర్థి మాచర్ల వరలక్ష్మి (శివయ్య భార్య)కు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చీరాల నియోజకవర్గ తెలుగు రైతు విభాగం అధ్యక్షులు పోలకం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, గ్రామంలోని ప్రజలను కలిసి వరలక్ష్మికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా పోలకం చంద్రశేఖర్ మాట్లాడుతూ, శివయ్య కుటుంబం నుంచి మాచర్ల వరలక్ష్మి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలవడం శుభపరిణామమని అన్నారు. గ్రామ ప్రజల నుంచి అభ్యర్థికి మంచి స్పందన లభిస్తోందని, ప్రజల ఆశీర్వాదంతో వరలక్ష్మి విజయం సాధించడం ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభ్యర్థికి మద్దతుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.







