క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-23
చీరాల మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారిగా టీడీపీ ఖాతాలో చైర్మన్ పీఠం దక్కింది. 16వ చైర్పర్సన్ గా కూటమి అభ్యర్థి ఎరిచర్ల హనీ స్పందన సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 44 వార్డులకు గాను 25 స్థానాల్లో విజయం సాధించింది.
77 ఏళ్ల చీరాల మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారి టీడీపీ ఖాతాలో చైర్మన్ పీఠం చేరింది. ఇప్పటి వరకు పరోక్ష పద్ధతిలోనే సాధ్యపడని మున్సిపల్ చైర్మన్ కుర్చీని ప్రత్యక్ష పద్ధతిలో టీడీపీ భారీ మెజార్టీతో కైవసం చేసుకోవడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. చైర్మన్ తో పాటు 44 వార్డులకు గాను 25 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. 16వ చైర్పర్సన్ కూటమి అభ్యర్థి ఎరిచర్ల హనీ స్పందన సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు.







