చీరాల, 19 October
చీరాల మున్సిపాలిటీకి చైర్పర్సన్ కియరు ప్రక్రియ సోమవారంతో ముగింది. ఈ కియకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 19 పేరులు దాఖలు చేశారు. చివరి రోజు పలువురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించడంతో ఎన్నికల సందడి నెలకొంది.
చీరాల మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవికి నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ పదవికి వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 19 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు పలువురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించడంతో ఎన్నికల సందడి నెలకొంది.
నామినేషన్ల వివరాల ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఐ. షెర్లీ 4 నామినేషన్లు, వి. ప్రగతి 2 నామినేషన్లు దాఖలు చేయగా, ఆ పార్టీ తరఫున మొత్తం 6 నామినేషన్లు నమోదయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరఫున వై. హనీ స్పందన 2, వై. బెన్నీ ప్రియ 1 నామినేషన్ దాఖలు చేయగా, మొత్తం మూడు నామినేషన్లు నమోదయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం. దివ్య 2, ఎం. రోజ్ పద్మిని 1 నామినేషన్ సమర్పించగా, మొత్తం 3 నామినేషన్లు దాఖలయ్యాయి.
స్వతంత్ర అభ్యర్థులుగా కె. మౌనిక, వై. కమల, ఎస్. భారతి దేవి, బి. సరిత తదితరులు నామినేషన్లు సమర్పించారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున కె. సుశీల నామినేషన్ దాఖలు చేశారు.
చైర్పర్సన్ పదవికి మొత్తం 19 నామినేషన్లు నమోదవడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం తుది అభ్యర్థుల జాబితాపై స్పష్టత రానుంది.









