రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుచ్చినాయుడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకట రత్నమ్మ అధ్యక్షతన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై రాజకీయ పార్టీల ముఖ్య ప్రతినిధులతో సమీక్షా సమావేశం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులపై చర్చించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుచ్చినాయుడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకట రత్నమ్మ అధ్యక్షతన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై రాజకీయ పార్టీల ముఖ్య ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా , నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ముసాయిదా జాబితా పరిశీలనపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, నియమావళి అమలుపై అధికారులతో పాటు నాయకులు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ సమావేశంలో అధికార తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెంచురామ్ నాయుడు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గురువయ్య, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు భాష, సీపీఎం పార్టీ మండల అధ్యక్షుడు నలుగురి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. తమ తమ పార్టీల అభిప్రాయాలను నాయకులు సమావేశంలో తెలియజేశారు.











