చీరాల క్యాంపు కార్యాలయంలో, చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ను 7వ వార్డుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువజన సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక అంశాలు, ప్రజా సమస్యలపై చర్చించారు.
చీరాల క్యాంపు కార్యాలయంలో, చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ను 7వ వార్డుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువజన సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేబ్రోలు అవినాష్, చేబ్రోలు ఆదిశేషు, తాటికొండ ఈశ్వర, వేణుగోపాలస్వామి, గుగ్గిలం నారాయణబాబు, తాటికొండ గుప్తా, ఆతిని శ్రీను, పోలిశెట్టి రాధా, తవ్వా సురేష్, చింతలపూడి సుబ్రహ్మణ్యం తదితరులు మహేంద్రనాథ్ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని స్థానిక అంశాలు, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై పరస్పరం చర్చించినట్లు తెలిపారు. పార్టీ కార్యకలాపాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువజన సభ్యులు పాల్గొన్నారు.











