బాపట్ల, జూలై 3
చీలజీఎెలేఆంచిశుంిజడసెంటలఎెలేబండఉేశుుిజడలిఆంులంలంగలిశు.ఈసంభంగటజీలు,జససలు,అభిధిఅంశలైఇుుుులుసుీఘంగచచించు.
చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం విజయవాడలోని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సమకాలీన పరిణామాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలు తదితర విషయాలపై ఇరువురు నాయకులు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు ప్రజలకు సంబంధించిన పలు కీలక అంశాలపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు.
ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. మర్యాదపూర్వక సమావేశమైనప్పటికీ, రాష్ట్ర రాజకీయాలపై జరిగిన చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం ఇరువురు నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని వీడ్కోలు పలికారు.












