చీరాల, 2026-08-22
రాష్ట్ర ఆర్యవశ్య కార్ొరేషన్ చర్మన్ డుండిండి డురాకేశ్ జరగన డాడిన ఇంటర్నేషనల్ వశ్య ఫెడిరేషన్ బాట్ల జల్లా అధ్యక్షులు, చీరాల నయోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు డోగుర్త బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. చీరాలలోన తన కార్యాలయంలో ఏర్ాటు చేసన వలేకరుల సమావేశంలో ఆయన ఈ డాడిన అమానుషమన అభవర్ణంచారు.
రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేశ్ పై జరిగిన దాడి అత్యంత అమానుషమని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు, చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ అన్నారు. చీరాలలోని తన కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు.
రాజకీయాల్లో హింస సరికాదు
రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు, విభేదాలు ఉండటం సహజమేనని, అయితే వాటిని హింసాత్మకంగా వ్యక్తపరచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ఎలాంటి అసంతృప్తి ఉన్నా ఓటు ద్వారా సమాధానం చెప్పాలి తప్ప భౌతిక దాడులకు పాల్పడటం సరైన పద్ధతి కాదన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
దాడులు, బెదిరింపులు వంటి హింసాత్మక చర్యలు రాజకీయ సంస్కృతికి మచ్చ తెస్తాయని, ఇటువంటి ఘటనలు సమాజంలో అశాంతికి దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. దుండి రాకేశ్‌పై దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్యకర వాతావరణానికి పిలుపు
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని, రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని దోగుపర్తి బాలకృష్ణ పిలుపునిచ్చారు.











