బాపట్ల జిల్లాలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని కె షర్మిల అండర్ 14 విభాగంలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈమె , 2 తేదీలలో కర్నూలులో జరిగే పోటీలలో జిల్లా తరఫున పాల్గొంటుంది.
బాపట్ల జిల్లాలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని వివరాలను ప్రధానోపాధ్యాయురాలు కే హనోరా తెలిపారు.అండర్ 14 విభాగంలో కె షర్మిల ప్రథమ స్థానం సాధించింది. ఈ విద్యార్థిని అక్టోబర్ ఒకటి, రెండు తేదీలలో కర్నూలులో జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో బాపట్ల జిల్లా తరఫున పాల్గొంటుందని తెలిపారు.ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు పి శ్రీనివాసులు, ఏ లావణ్య, పాఠశాల సిబ్బంది విద్యార్థినికి అభినందనలు తెలిపారు.







