వినుకొండ, 2026-06-05
వినుకొండ పట్టణంలో రూ.239.06 కోట్ల వ్యయంతో నూతనంగా చేపడుతున్న తాగునీటి పథకానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని ఎన్ఎస్పీ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరిగింది.

రెండేళ్లలో నిర్మాణం పూర్తి
ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, వినుకొండ ప్రజలకు తాగునీటి కష్టాల నుంచి శాశ్వత విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుందని తెలిపారు.
అధికారులు, నాయకుల హాజరు
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.