కార్యక్రమంలో (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 23
చీరాల మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హెచ్ఏఎం) పథకం కింద మౌలిక సదుపాయాల కల్పనకు రూ.144 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పనులను మంగళవారం కుప్పం నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం చీరాల మున్సిపాలిటీ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హెచ్ఏఎం) పథకం కింద చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య ముఖ్యమంత్రితో మాట్లాడి, పట్టణ అభివృద్ధి పనుల వివరాలను వివరించారు. చీరాల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికే 80 అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, డీఎంఎఫ్ నిధులతో రూ.34.83 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన హెచ్ఏఎం పథకం కింద చీరాలకు రూ.144 కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. ఈ నిధులతో మురుగునీటి వ్యవస్థ, రహదారులపై డివైడర్లు, పార్కులు, వీధి విద్యుత్ దీపాలు తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 139 సిమెంట్ రోడ్డు పనులు, 8.26 కిలోమీటర్ల మేర వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు, తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఆర్డీవో నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ జోసెఫ్ డేనియల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.












