కారంచేడు, 26 September
కారంచేడు మండలంలో భూముల పరిశీలన
భూమి కొనుగోలు పథకం కింద ఎస్సీ లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూములను 22-ఎ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములను 22-ఎ నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఆ భూమిని అనుభవిస్తున్న లబ్ధిదారులను మాత్రమే తొలగిస్తామని, ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.
కారంచేడు మండలంలో భూముల పరిశీలన
మండలంలో 2005 సంవత్సరంలో 28 మంది ఎస్సీ లబ్ధిదారులకు భూమి కొనుగోలు పథకం కింద ప్రభుత్వం 13.32 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం ఆ భూమి 22-ఎ నిషేధిత భూముల జాబితాలోకి చేరడంతో, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ భూమిని 22-ఎ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు దస్త్రాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
చిన్నగంజాం మండలంలోనూ ప్రక్రియ
తదుపరి, చిన్నగంజాం మండలంలో 22-ఎ నిషేధిత భూముల జాబితా కింద ఉన్న భూములను తొలగించే అంశంపై దస్త్రాలను పరిశీలించారు. అర్హత ఉన్న భూములను తొలగించే ప్రక్రియ చేపట్టగా, అర్హత లేని దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, ల్యాండ్స్ రికార్డ్స్ ఏడి శేషగిరిరావు, జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారి శ్రీనివాసరావు, చీరాల ఆర్డీవో నరసింహారావు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.











