ఏలూరు, జూలై 23
ఏలూరు జిల్లా శిశు గృహంలో ఉన్న మూడు నెలల పాప 'కృతిక' దత్తత ప్రక్రియ గురువారం విజయవంతంగా పూర్తయింది. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చేతుల మీదుగా చెన్నైకి చెందిన దంపతులకు ఈ పాపను అప్పగించారు. ఈ దత్తత మిషన్ వాత్సల్య పోర్టల్ ద్వారా జరిగింది.
ఏలూరు జిల్లా శిశు గృహంలో తాత్కాలికంగా ఉంటున్న మూడు నెలల పాప 'కృతిక' దత్తత ప్రక్రియ గురువారం విజయవంతంగా పూర్తయింది. జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చేతుల మీదుగా చెన్నైకి చెందిన దంపతులకు ఈ పాపను అప్పగించారు.
తమిళనాడులోని చెన్నైకి చెందిన కుమారి, మధు శ్రీనివాసన్ దంపతులు 2022లో దత్తత కోసం 'కారా' (CARA) పోర్టల్లో దరఖాస్తు చేసుకున్నారు. వారి సీనియారిటీ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరుకు చెందిన 'కృతిక' పాప మిషన్ వాత్సల్య పోర్టల్ ద్వారా రిఫరల్ వెళ్లగా, దంపతులు ఆమెను రిజర్వ్ చేసుకున్నారు.
దత్తత కమిటీ నిబంధనల ప్రకారం అన్ని ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం, జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ కే. వెట్రిసెల్వి ఈ పాపను దత్తత తల్లిదండ్రులకు అధికారికంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారి పి. శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సి.హెచ్. సూర్య చక్రవేణి, శిశుగృహ మేనేజర్ కె. భార్గవి, నర్స్ ఎ. విశాలి తదితరులు పాల్గొన్నారు.










