బాపట్ల, 2026-07-27
ఈపూరుపాంగరామంోనినిరుపయోగంగాఉననహయాండూమస&టసటైసశిషణాేందరాననివంటనేమనుగడోితీసుురావానిజిాటరడాటరవినోదుమారఆదేశించారు.చీరామండం,ఈపూరుపాంగరామంోనిశిషణాేందరానని,బసతపాంగరామచావడిపరిధిోనిసి.ఎఫ.సిభూమునుఆయనపరిశీించారు.
ఈపూరుపాలెం గ్రామంలోని హ్యాండ్లూమ్స్ & టెక్స్ టైల్స్ శిక్షణా కేంద్రాన్ని మనుగడలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం చీరాల మండలం, ఈపూరుపాలెం గ్రామంలోని హ్యాండ్లూమ్స్ శిక్షణ కేంద్రాన్ని, చీరాల పట్టణంలోని బెస్తపాలెం గ్రామ చావడి పరిధిలో ఉన్న సి.ఎఫ్.సి భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ముందుగా ఈపూరు పాలెం గ్రామంలోని హ్యాండ్లూమ్స్ & టెక్స్ టైల్స్ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించి, మనుగడలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని, శిక్షణా కేంద్రాన్ని ఎందుకు ఉపయోగించలేదని, వెంటనే శుభ్రం చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని ఏ.డి.ని ఆదేశించారు.
అనంతరం చీరాల పట్టణంలో బెస్త పాలెం లోని గ్రామ చావడి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ), డీఎస్ఓ, తహశీల్దార్, గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)లను స్థల వివరాలు, విస్తీర్ణం, భవిష్యత్ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై అడిగి తెలుసుకున్నారు.
మున్సిపాలిటీకి ఉపయోగపడే విధంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టవచ్చోనని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం అభివృద్ధి చేసే దిశగా అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ నరసింహా రావు, డి.ఎస్.ఓ. జగన్మోహన్, చీరాల మున్సిపల్ కమీషనర్ దానియేలు జోసఫ్, తహశీల్దార్ గోపి కృష్ణ, సి.ఎస్.డి.టి ఓంకార్, శాండిఇన్స్ పెక్టర్ లక్ష్మి, హ్యాండ్లూమ్స్ & టెక్స్ టైల్స్ ఏ.డి., వీ.ఆర్.ఓ.లు, వీ.ఆర్.ఏ.లు తదితరులు ఉన్నారు.










