బాపట్ల, ఆగస్టు 6, 2026
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా బి. ఉమామహేశ్వర్ 64 మంది అర్జీదారుల సమస్యలను ఆలకించారు. వారి వినతిపత్రాలను పరిశీలించి, చట్ట పరిధిలో వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 64 మంది అర్జీదారులు తమ సమస్యలను జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కు వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి, వారు సమర్పించిన వినతిపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ప్రతి అర్జీని చట్ట పరిధిలో విచారించి వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించారు.
పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని, పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను చట్టబద్ధంగా విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ అర్జీదారులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో భూవివాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, ఇతర సమస్యలకు సంబంధించిన మొత్తం 64 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










