గుంటూరు, 2026-11-29
తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాయపాటి మృతి రాజకీయ, సామాజిక రంగాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) మృతి పట్ల తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
రాయపాటి మృతి రాజకీయ, సామాజిక రంగాలకు తీరని లోటని ఏలూరి పేర్కొన్నారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన రాయపాటి సాంబశివరావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి విశేష కృషి చేశారని ఏలూరి కొనియాడారు.
రాయపాటి రాజకీయ ప్రస్థానం
రాయపాటి సాంబశివరావు అనారోగ్యంతో గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడం బాధాకరమని ఏలూరి అన్నారు. 1947లో గుంటూరు జిల్లా ఉంగుటూరులో జన్మించిన రాయపాటి, 1972లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారని ఏలూరి గుర్తు చేశారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రాయపాటి సేవలు చిరస్మరణీయమని ఏలూరి పేర్కొన్నారు.
రాయపాటి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఏలూరి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఏలూరి తెలిపారు.





