మార్టూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) ఆగస్టు 12
పర్చూరు నియోజకవర్గం పరిధిలోని మార్టూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శివరాత్రి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా గొట్టిపాటి వెంకట్రావులను నియమించారు. ఈ నియామకాలను పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు చేపట్టారు.
మార్టూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శివరాత్రి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా గొట్టిపాటి వెంకట్రావులను నియమిస్తూ పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు నియామకం జరిగింది.
పార్టీ బలోపేతానికి కృషి
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన మండల అధ్యక్షుడు శివరాత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఏలూరి సాంబశివరావు గారి నాయకత్వంలో మండలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.












