బాపట్ల, 7 September
మార్టూరు పట్టణంలో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
పోలీసులతో కలిసి హ్యూమన్ రైట్స్ ప్రతినిధి షేక్ మౌలాలి! మార్టూరు లోని రాజుపాలెం స్టేజి వద్ద భారీగా ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని గమనించిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అదనపు జనరల్ సెక్రటరీ షేక్ మౌలాలి వెంటనే స్పందించారు. ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో కలిసి స్వయంగా రోడ్డుపైకి దిగి వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేయడంలో సహకరించారు.గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులకు మార్గం సుగమం చేసేందుకు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టారు. అత్యవసర వాహనాలు, ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్‌ను వేగంగా క్లియర్ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.ప్రజా సమస్యపై స్పందించడమే కాకుండా.. సమస్య పరిష్కారంలో స్వయంగా భాగస్వామిగా నిలిచిన షేక్ మౌలాలి చర్యపై పలువురు అభినందనలు తెలిపారు.











