Hyderabad/Agartala (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 21
కారంచేడు మండలం స్పర్థ గ్రామంలోని రైతుసేవా కేంద్రంలో ఖరీఫ్ - 2026-97 సీజన్ కు 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున వరి సాగు చేయరాదని, బదులుగా నూనెగింజలు, వాణిజ్య పంటలు సాగు చేయాలని సూచించారు.
కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని రైతుసేవా కేంద్రం నందు ఈ రోజు ఖరీఫ్ - 2026-97 సీజన్ కు 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి A.లక్ష్మి , డివిజన్ వ్యవసాయ అధికారి ప్రవీణ , మండల వ్యవసాయ అధికారి M.నాగరాజు , ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ సిబ్బంది, మాలెంపాటి సత్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీహరి పాల్గొన్నారు.
ఎన్నినే కారణంగా నీటి లభ్యత అదుబాటులో లేనందున ఈ సీజన్ లో వరి సాగు చేయరాదని రైతులకు తెలియజేయడం జరిగింది.
నూతనంగా ఆవిష్కరించిన Apalms - 2.0 యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. వరి సాగుకు బదులుగా, తక్కువ నీటితో అయ్యే నూనెగింజలు, ఇతర వాణిజ్య పంటలు సాగు చేయాలని రైతులకు తెలిపారు.
యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను, నానో DAP లను రైతులు ఉపయోగించుకోవాలని, ప్రస్తుతం ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని, అవసరమైతే కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
పంటలు సాగు చేసిన వారు తప్పనిసరిగా ఈ కాప్ ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రసన్న , బిందు , మరియు రైతులు పాల్గొన్నారు.












