గంపలగూడెం, జూలై 21
స్థానిక గ్రామానికి చెందిన ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడు బుడెన్ అనారోగ్యంతో అకాల మరణం చెందడం పట్ల మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (HRCI) నాయకులు దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. HRCI నాయకులు మంగళవారం బుడెన్ నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
స్థానిక గ్రామానికి చెందిన ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడు బుడెన్ ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందడం పట్ల మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (HRCI) నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
బుడెన్ మరణవార్త తెలుసుకున్న HRCI ఎన్టీఆర్ జిల్లా ఉమెన్ పోర్ట్ సభ్యురాలు జి. నాగ మల్లిక మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆర్. శ్రీరామ్ లు మంగళవారం ఊటుకూరులోని వారి నివాసానికి వెళ్లి, మృతుని చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.
అనంతరం తమ సొంత ఖర్చులతో కుటుంబ పోషణకు చేయూతగా 25 కేజీల బియ్యం మరియు నిత్యావసర సరుకులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామానికి కబడ్డీ క్రీడాకారుడిగా మంచి పేరు తెచ్చిన బుడెన్ మరణం తీరని లోటని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కష్టకాలంలో తమ ఇంటికి వచ్చి ధైర్యం చెప్పి, ఆదుకున్న హెచ్.ఆర్.సి.ఐ (HRCI) ప్రతినిధులు నాగ మల్లిక, శ్రీరామ్ కు బుడెన్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.











