బాపట్ల, 7 September
మార్టూరులో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసినందుకు స్థానిక ప్రజలు పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేదలు, కూలీలు, సామాన్య ప్రజల ఆకలి తీర్చడంలో ఈ క్యాంటీన్ ఉపయోగపడుతుండటంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మార్టూరులో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పేదలు, కూలీలు, సామాన్య ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఉపయోగపడుతుండటంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రోజుకు వందలాది మంది ఈ క్యాంటీన్‌ను వినియోగించుకుంటుండటమే దీని అవసరాన్ని తెలియజేస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు. అన్న క్యాంటీన్ సేవలు నిరంతరం కొనసాగడంతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. “ఆకలితో ఉన్న పేదవాడికి అందించే ఒక్క ముద్ద అన్నం.. మానవత్వానికి ప్రతీక” అన్న భావనకు మార్టూరులోని అన్న క్యాంటీన్ నిదర్శనంగా నిలుస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు.












