మహిళలు, బాలికల భద్రతతో పాటు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు చీరాల సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ మోయిన్ సూచనలతో చీరాల టూ టౌన్ సీఐ శశికుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం మంగళవారం ఏపీ మోడల్ స్కూల్లో జరిగింది.
ఎస్సై కె. పాల్ రవీంద్ర ఆధ్వర్యంలో శక్తి బృందం, ఈగల్ టీం సభ్యులు విద్యార్థినీ, విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో మహిళలు తక్షణ సహాయం పొందే విధానాన్ని వివరించారు. ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలను అరికట్టడంలో శక్తి యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత
గుడ్ టచ్బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తూ, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అపరిచితుల సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
పోక్సో చట్టం, సెల్ఫ్ డిఫెన్స్
పోక్సో చట్టం, బాలల రక్షణ, మహిళల భద్రత, సెల్ఫ్ డిఫెన్స్ అంశాలపై కూడా అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 181, 1972, 1091, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శివకుమారి, కానిస్టేబుల్ కె. సుబ్బారావు, ఈగల్ టీం సభ్యుడు సురేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












