సోమవారం జరిగిన ఈ ఘటనలో, ప్రిన్స్ రాజ్ అనే విద్యార్థి తన క్లాస్మేట్ సందీప్ కౌర్ ను కాల్చి చంపాడు.
ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని తర్న్ తరన్ జిల్లాలోని 'లా' కాలేజీలో జరిగింది. ప్రిన్స్ రాజ్, సందీప్ కౌర్ కు ప్రేమ ప్రపోజ్ చేసినట్లు సమాచారం.
సందీప్ కౌర్ నిరాకరించడంతో, ప్రిన్స్ ఆవేశానికి లోనై ఆమెను కాల్చాడు. ఈ కాల్పుల్లో ఆమె మరణించింది.
తర్వాత, ప్రిన్స్ తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.


