బాపట్ల, 16 జూలై 2026
చీరోఫఇీరగఅడీోడపొమతొవతరవదరథుు,వరతదడరుోగురువరఓరషరరమరగద.ఈదరభగళశమవదరథుు,తదడరుుహవచ,వదౌరు,పమఅవశపైఅవగహపచద.
చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా తొలి సంవత్సరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, కళాశాల యాజమాన్యం వారిని సాదరంగా ఆహ్వానించింది.
ఈ సందర్భంగా కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలు, ఆధునిక ప్రయోగశాలలు, శిక్షణా విధానం, ప్లేస్మెంట్ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, కళాశాల నియమ నిబంధనలు వంటి అంశాలపై అధ్యాపకులు, యాజమాన్యం విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కళాశాల NAAC ద్వారా 'A' గ్రేడ్ గుర్తింపు, NBA అక్రిడిటేషన్, JNTU శాశ్వత అనుబంధం, AICTE ఆమోదం, UGC 2(f), 12(B) గుర్తింపు వంటి ప్రతిష్ఠాత్మక గుర్తింపులు పొందిందని యాజమాన్యం తెలిపింది. విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ ఓరియంటేషన్ కార్యక్రమం ద్వారా మార్గనిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.










