నంద్యాల, 2 July
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు, గుర్తింపు పొందిన బీపీఎల్ జర్నలిస్టుల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరంలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు, గుర్తింపు పొందిన బీపీఎల్ జర్నలిస్టుల కుటుంబాల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించనున్నట్లు శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ అమలు చేయడంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
విద్యా రంగంలో విశేష ఫలితాలు సాధిస్తున్న శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యానికి జర్నలిస్టులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 2025 పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో రెండో స్థానం, అనంతరం ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ రాష్ట్ర రెండో స్థానం కైవసం చేసుకోవడం స్కూల్ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు శ్రీ లక్ష్మీ స్కూల్లోనే చదివిన విద్యార్థిని ఈ ఘనత సాధించడం పాఠశాల ప్రతిష్ఠను మరింత పెంచిందని తెలిపారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.











