బాపట్ల, 19 జూలై 2026
యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యుటీఎఫ్) గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టెట్ (TET) తెలుగు శిక్షణా తరగతికి విశేష స్పందన లభించింది. ఏసీ కాలేజ్ అసెంబ్లీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరై శిక్షణ పొందారు.
యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యుటీఎఫ్) గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టెట్ (TET) తెలుగు శిక్షణా తరగతికి విశేష స్పందన లభించింది. ఏసీ కాలేజ్ అసెంబ్లీ హాల్లో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమానికి 500 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరై శిక్షణ పొందారు.
ఈ సందర్భంగా స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) రాచూరి వెంకట్రావు టెట్ పరీక్షలో తెలుగు అంశానికి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను, ప్రశ్నల సరళిని, సమాధానాల ఎంపిక విధానాన్ని సులభంగా వివరించారు. ఆయన బోధన ఉపాధ్యాయులను ఆకట్టుకుంది.
అనంతరం రాచూరి వెంకట్రావును యుటీఎఫ్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు, యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు యు. రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొని ఉపాధ్యాయులకు టెట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు టెట్ పరీక్షలో విజయాన్ని సాధించేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని యుటీఎఫ్ నాయకులు తెలిపారు.












