పర్చూరు, 18 September
పిత్తాశయంలో రాళ్లతో ఏడాది కాలంగా తీవ్ర నొప్పితో బాధపడుతున్న నిరుపేద మహిళకు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సాయం అందింది. ఈ మేరకు రూ.50,289 మంజూరు అయ్యాయి.
పిత్తాశయంలో రాళ్లతో ఏడాది కాలంగా తీవ్ర నొప్పితో బాధపడుతున్న నిరుపేద మహిళకు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సాయం అందింది. మండలం చెరుకూరు గ్రామానికి చెందిన కొమ్మనబోయిన కామేశ్వరి (55), గత ఏడాది కాలంగా పిత్తాశయంలో రాళ్ల కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మందులతో ఉపశమనం లభించకపోవడంతో శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడలోని రియా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స ఖర్చులు భరించే ఆర్థిక స్తోమత లేక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే, కామేశ్వరి చికిత్సకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకున్నారు. ఎమ్మెల్యే లేఖ ఆధారంగా, ముఖ్యమంత్రి కార్యాలయం రియా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూ.50,289 మంజూరు చేస్తూ లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసింది. సీఎంఆర్ఎఫ్ సాయంతో చికిత్స ఖర్చుల విషయంలో కొంత ఊరట లభించడంతో, కామేశ్వరి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలిపారు.












