పర్చూరు, 2026-06-05
పర్చూరు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వల్లపర్ల, పెదగంజాం, మోటుపల్లి గ్రామాల్లో కొత్తగా మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్సీలను) ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.

అలాగే, నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న పీహెచ్సీలకు మరింత మెరుగైన వైద్య పరికరాలు, అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఎమ్మెల్యే ఏలూరి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనే వైద్య సేవలు అందుబాటులో ఉంటే సకాలంలో చికిత్స అందించి ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.