బాపట్లలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సమన్వయ సమావేశం 2026 ఫిబ్రవరి 10న నిర్వహించబడింది.
ఈ సమావేశంలో, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి ఆధ్వర్యంలో, 1 నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు ఫిబ్రవరి 17న ఆల్బెండజోల్ మాత్రలు మింగించాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు.
ఫిబ్రవరి 17న ఆల్బెండజోల్ మాత్రలు మింగకుండా మిగిలిపోయిన వారికి ఫిబ్రవరి 24న మళ్ళీ మింగించడం జరుగుతుంది. జిల్లా లో 329850 మంది 1 నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలు ఉన్నారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, అంగన్వాడి కార్యకర్తలు, మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ కార్యక్రమం కింద విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు ఫిబ్రవరి 17న మధ్యాహ్నం భోజనం తర్వాత మింగించాలన్న ఆదేశాలు ఇవ్వాలని కోరారు.


