ఉలవపాడు, 11 September
మండలంలోని అంగన్వాడీ సెంటర్ 1లో శుక్రవారం 9వ పోషకాహార మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. సీడీపీఓ ఆదేశాల మేరకు సూపర్వైజర్ రమాదేవి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, ఇతర తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం లో బాగంగా...... క్రౌన్ హ్యూమన్ రైట్స్ : మండలం లో జరుగుతున్న పోషకాల మాసోత్సవం కార్యక్రమం లో భాగంగా శుక్రవారం సిడిపిఓ ఆదేశాల మేరకు సూపర్వైజర్ రమాదేవి ఈ కార్యక్రమం జరుపటమైనది మండలంలోని అంగన్వాడీ సెంటర్1 లో 9th పోషకాహార మాస ఉత్సవాలు జరిపినారు ఇందులో భాగంగా గర్భవతులు బాలింతలు ఇతర తల్లులు అందరు పాల్గొన్నారు వీరికి నూనె గురించి చక్కెర గురించి ఉప్పు గురించి ఉప్పు ఎక్కువగా వాడకం వల్ల వచ్చే సమస్యల గురించి వివరించితిమి. అలాగే పిల్లలకు అంగన్వాడి వయసు పిల్లలకు పోషకాహారం ప్రోటీన్స్ పోషకాహారం బాగా అందుతుందని తల్లులకు వివరించడం జరిగింది. అందులో మెదడు అభివృద్ధి 85% నుంచి 90% అభివృద్ధి చెందుతుందని ఎప్పుడు వేడివేడి ఆహార పదార్థాలను పిల్లలకు అందించాలని ఇందులో భాగంగా సూపర్వైజర్ రమాదేవి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే తాజా వేడి వేడి పోషకాహారాన్ని గురించి వివరించారు మొదటి 1000 రోజులు చాలా ముఖ్యమైనవి అని తల్లులకు బాలామృతం గురించి వివరించారు ఇందులో తల్లులు పిల్లలు గర్భవతులు బాలింతలు ఇతర తల్లుల అంగన్వాడీ కార్యకర్తలు ఎం పద్మావతి హేమలత సహాయకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












