క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-23
గుడివాడ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో 43వ వార్డు కూటమి బలపరిచిన జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా గోకరకొండ బలరామకృష్ణ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు.
ఈ సందర్భంగా 43వ వార్డు ప్రజలను ఉద్దేశించి బలరామకృష్ణ మాట్లాడుతూ, వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేసేందుకు ప్రజల మద్దతు కోరారు.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు
అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మరీదు కరుణకు కూడా తమ అమూల్యమైన ఓటును వేసి మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన గతంలో మాజీ కౌన్సిలర్‌గా, వివిధ గుడివాడ శాఖల పదవులలోనూ పనిచేశారు.
43వ వార్డుతో పాటు గుడివాడ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనకు మద్దతు తెలపాలని వార్డు ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.







