పల్నాడు, 2026-11-22
పల్నాడు జిల్లా కారంపూడి గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా, బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని స్టేజ్-1 కార్యాలయంలో 6వ వార్డు అభ్యర్థిగా తోట లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. తోట నరసింహారావు (అబ్బాయి) గారి సతీమణి అయిన తోట లక్ష్మిని, గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో కూటమి సభ్యులు 6వ వార్డు అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
అభినందనలు
ఈ సందర్భంగా పలువురు పెద్దలు, కూటమి నాయకులు తోట లక్ష్మిని అభినందిస్తూ, రిటర్నింగ్ అధికారి బాబు నాయక్ గారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.







