బాపట్ల, August 1, 2026
ఆధదథనథఎనననహణుషఎననమషనననహుముమమద.ఈనె6నఎననమషననదునఠీమనహనునను.ఈమఎననయ,ుుథ,ఇఏైమీషజనుద.
ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్ ఎన్నికలతో సహా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 6న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో వార్డుల విభజన, కోర్టు కేసుల స్థితి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు వంటి అంశాలపై సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని ఎన్నికలను అక్టోబర్‌లోపు పూర్తి చేసే అవకాశాలున్నాయని సమాచారం.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, ముందుగా మున్సిపల్ ఎన్నికలు, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, చివరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.












