పోటీల్, చీరాల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
జేఎన్టీయూకే కాకినాడ సెంట్రల్ జోన్ మహిళల వాలీబాల్ పోటీల్లో చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థినులు విజేతలుగా నిలిచారు.
జేఎన్టీయూకే కాకినాడ సెంట్రల్ జోన్ మహిళల వాలీబాల్ పోటీల్లో చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. నరసరావుపేటలోని తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల నిర్వహించిన ఈ పోటీల్లో సుమారు 30 కళాశాలలకు చెందిన జట్లు పాల్గొనగా, సెయింట్ ఆన్స్ కళాశాల జట్టు విజేతగా నిలిచి చీరాల ప్రాంతానికి, కళాశాలకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చింది. ఈ పోటీల్లో ఫైనల్ మ్యాచ్లో భీమవరంలోని విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాల జట్టును ఓడించి సెయింట్ ఆన్స్ విద్యార్థినులు విజయం సాధించినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు.
ఈ విజేత జట్టులో కె. అనిత, సీహెచ్. అనూష, వి. హారిక, వై. భూమిక, కె. పూజిత, పి. నిషిత, కె. ఉమామహేశ్వరి పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుకున్నారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కె. అనిత, వి. హారికలు త్వరలో జరగనున్న ఇంటర్ యూనివర్సిటీ మహిళల వాలీబాల్ పోటీల్లో జేఎన్టీయూకే కాకినాడ జట్టుకు ఎంపిక కావడం విశేషం. ఈ విజయంపై కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్. లక్ష్మణరావు హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీష్ బాబు మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం గర్వకారణమని, వారి విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు.
ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు, కళాశాల మేనేజర్ ఆర్.వి. రమణమూర్తి, డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) వనమా దొర నాగ సాయినాథ్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని విజేత జట్టును అభినందించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.






