బాపట్ల, 2026-11-20
బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రభుత్వ హోమియో వైద్యులు రోగులను పరిశీలించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్, జిల్లేలమూడి ప్రభుత్వ హోమియో వైద్యురాలు డాక్టర్ ఐనాపురపు భువనేశ్వరి రోగులను పరిశీలించి, ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ ఉచిత హోమియో వైద్య శిబిరంలో అన్ని రకాల దీర్ఘకాలిక, తరుణ వ్యాధులతో పాటు, తగ్గని మొండి వ్యాధులకు కూడా అత్యుత్తమ ప్రభుత్వ హోమియో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బాపట్ల పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ ఉచిత హోమియో వైద్య శిబిర సేవలను సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ బట్టు, సిబ్బంది నవనీతం, రాజేష్, సిఫోరా, లావణ్య, ప్రియాంక, రామరాజు, కాంపౌండర్ డి. విజయ రాజు, తదితరులు పాల్గొన్నారు.







