బాపట్ల, 2026-09-15
బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ సూచనలతో, చీరాల వన్ టౌన్ పరిధిలోని బీవీ బీఎన్ జీహెచ్ఎస్ జాన్రెపేటలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శక్తి యాప్, సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం, సెల్ఫ్ డిఫెన్స్ వంటి అంశాలపై పోలీసులు విద్యార్థులకు వివరించారు.
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో, చీరాల వన్ టౌన్ పరిధిలోని బీవీ బీఎన్ జీహెచ్ఎస్ జాన్రెపేటలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈరోజు, అనగా 15.09.2026, మంగళవారం నాడు విద్యార్థినీ విద్యార్థుల కోసం చీరాల వన్ టౌన్ సీఐ జి.సోమశేఖర్ సూచనల మేరకు ఎస్ఐ రాజ్యలక్ష్మి, సబ్ డివిజన్ శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ రాజ్యలక్ష్మి, చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం కానిస్టేబుల్ కే. సుబ్బారావు నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ గురించి వివరిస్తూ, అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలను అరికట్టేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని వివరించారు.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తూ, తమను ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పాలని సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో, విద్యార్థులు సోషల్ మీడియాలో (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) వచ్చే నకిలీ వార్తలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు హెల్ప్‌లైన్ నంబర్లు 100, 112, 181, 1091, 1098కు కాల్ చేస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఫోక్సో చట్టం (పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం)పై, మహిళల రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జి.రాజ్యలక్ష్మి, కానిస్టేబుల్ సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు , సీనియర్ ఉపాధ్యాయులు ., సహ ఉపాధ్యాయుని వై రాజకుమారి, అసిస్టెంట్లు వెంకట్రావు, వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.










