బుచ్చినాయుడుకండ్రిగ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 15
మండలంలోని ఎన్టీఆర్ నగర్ గ్రామంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామ యువత ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సామాజిక బాధ్యతగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
*ఎన్టీఆర్ నగర్లో మిన్నంటిన 'చవితి' సంబరాలు యువత ఆధ్వర్యంలో అన్నదానం, చీరల పంపిణీ* క్రౌన్ హ్యూమన్ రైట్స్; మండల పరిధిలోని ఎన్టీఆర్ నగర్ గ్రామంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామంలోని భక్తులు, ముఖ్యంగా యువత అంతా ఏకమై స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.మన ఊరి ఐక్యతకు, భక్తికి ప్రతీక అయిన ఈ వినాయక చవితి వేడుకల మధురమైన క్షణం జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు వస్తుంటాయి, కానీ మన ఊరి ప్రజలందరం కలిసికట్టుగా స్వామివారి సన్నిధిలో ఆనందంగా గడిపిన ఈ రోజు మాత్రం ఎప్పటికీ చిరస్మరణీయం. మన మధ్య ఉన్న ఈ ఆప్యాయత, అనుబంధాలు ఇలాగే ఎప్పటికీ నిలవాలని కోరుకుంటూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మన గ్రామ ప్రజలందరికీ ఈ ప్రత్యేక జ్ఞాపకాన్ని బహుమతిగా అందిస్తున్నాను.ఈ పండుగ సంబరాలలో భాగంగా గ్రామ యువతీయువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, భారీ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే సామాజిక బాధ్యతగా గ్రామానికి చెందిన పలువురు పేద మహిళలకు పురుషోత్తం ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేపట్టారు.వినాయకుడి చల్లని దీవెనలతో మన ఊరు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ... ఈ మహత్కార్యంలో గ్రామ యువకులు పురుషోత్తం, తేజ, సుబ్బు, అజయ్, వెంకటేష్, కృష్ణమూర్తి, శ్రీను, సాయి, జగదీష్, ధన, మహేష్, నవీన్ తదితరులు ముందుండి నడిపించారు. వారి సేవా నిరతిని గ్రామ పెద్దలు, ప్రజలు ఎంతగానో అభినందించారు.












