క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-21
చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో భారతీయ ఆర్థిక మార్కెట్లు, స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడులపై రెండు రోజుల వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఎంబీఏ విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిమ్స్ ట్రైనర్ డాక్టర్ వి. నరేంద్ర ముఖ్య శిక్షకుడిగా హాజరయ్యారు.
చీరాల క్రౌన్ హ్యూమన్ రైట్స్ : విద్యార్థులకు భారతీయ ఆర్థిక మార్కెట్లు, స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడుల విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది.
కళాశాలలో ఎంబీఏ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్ అనే అంశంపై ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ విషయాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (నిమ్స్), ముంబై ట్రైనర్, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. నరేంద్ర ముఖ్య శిక్షకుడిగా హాజరై విద్యార్థులకు స్టాక్ ట్రేడింగ్‌పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన భారతీయ ఆర్థిక మార్కెట్లలో కీలకమైన ప్రైమరీ, సెకండరీ, డెరివేటివ్ మార్కెట్ల పనితీరు, స్టాక్ మార్కెట్లో షేర్ల కొనుగోలు, అమ్మకాల విధానాలను వివరించారు. సామాన్య పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సెబీ అమలు చేస్తున్న నిబంధనలు, రక్షణ చర్యల గురించి వివరించారు. నిమ్స్ నిర్వహించే సర్టిఫికెట్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకొని ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని సూచించారు.
ఈ వర్క్‌షాప్ ఎంబీఏ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని, స్టాక్ మార్కెట్‌పై ఆచరణాత్మక అవగాహన పెంపొందించేందుకు దోహదపడిందని ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఆర్. ఇమ్మానియేల్ తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీశ్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు పరిశ్రమలు, ఆర్థిక రంగానికి సంబంధించిన నైపుణ్యాలను అందించడంలో ఇటువంటి వర్క్‌షాప్‌లు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎస్. చాంద్ బాషా కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించగా, ఎంబీఏ విభాగ అధ్యాపకులు పాల్గొన్నారు.







