క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-22
చీరాల పట్టణంలోని ఎన్.ఆర్. పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ 2026 సంవత్సరంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా మొత్తం ఎనిమిది అవార్డులను సొంతం చేసుకుంది. నెల్లూరు క్లబ్ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్, అవార్డుల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాలను అందజేశారు.
క్రౌన్ హ్యూమన్ రైట్స్, నెల్లూరు: చీరాల పట్టణంలోని ఎన్.ఆర్. పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ 2026 సంవత్సరంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా మొత్తం ఎనిమిది అవార్డులను సొంతం చేసుకుంది. నెల్లూరు క్లబ్ ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్, అవార్డుల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాలను అందజేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చీరాల ఎన్.ఆర్. పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణకు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డుతో పాటు మొత్తం ఎనిమిది అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పి. రవిరాజు, డిస్ట్రిక్ట్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు, నేతాజీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డులను పోలుదాసు రామకృష్ణ అందుకున్నారు.
చీరాల పట్టణంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, సామాజిక సేవలో సభ్యుల భాగస్వామ్యం, సంస్థ అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డులు నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ గుర్తింపు సంస్థ సభ్యుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణతో పాటు గుర్రం బదరీనాథ్, గ్రంథి నారాయణమూర్తి, పాలపర్తి వెంకటేశ్వరరావు, గుద్దంటి రమేష్, గొడవర్తి సుధాకరరావు, సుభాషిణి, రమణారావు, చుండూరు శ్రీనివాసరావు, చీమకుర్తి మధుసూదనరావు, పూర్ణ, రవి, భాస్కర్, తుకారాం, చెంగలరాయుడు తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. చీరాల వాకర్స్ అసోసియేషన్‌కు ఎనిమిది అవార్డులు లభించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.




