క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-21
రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గొనసపూడి, చింతగుంపల్లి, కొత్తపాలెం, పల్లెపాలెం గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద శాంతి సమావేశాలు నిర్వహించారు.
రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గొనసపూడి, చింతగుంపల్లి, కొత్తపాలెం, పల్లెపాలెం గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద శాంతి సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశాల్లో చిన్నగంజాం తహశీల్దార్ జి. ప్రభాకరరావు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అభ్యర్థులు, వారి అనుచరులు సంయమనం పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు.
రాజకీయ విభేదాలను వ్యక్తిగత ఘర్షణలుగా మార్చుకోవద్దని, గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడకూడదని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలందరూ అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జి. ప్రభాకరరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.







