టీడీపీ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 20
నెల్లూరు జిల్లాలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతును స్పష్టం చేశాయి. జిల్లాలోని 35 జడ్పీటీసీ స్థానాలకు గాను 33 స్థానాల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గెలుపొందిన సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి జిల్లాలోని జడ్పీటీసీ ఫలితాలు. జడ్పీ ఛైర్మన్ గా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి, జడ్పీ వైస్ ఛైర్మన్ గా పొట్టేళ్ల ప్రసాద్ కు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు ఆశీర్వదించారు, అందుకే 35 జడ్పీటీసీ స్థానాల్లో 33 గెలుచుకున్నాం. గెలుపు ధీమాతో ఏమరుపాటు వద్దు. గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీపీలు 2029 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలి. కూటమి పార్టీల తరపున గెలుపొందిన జడ్పీటీసీ విజేతలకు శుభాకాంక్షలు.
నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కూటమి పార్టీల తరఫున గెలుపొందిన జడ్పీటీసీ సభ్యులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పాశం సునీల్ కుమార్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి, డిసిసిబి చైర్మన్ ధనుంజయ రెడ్డి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, జడ్పీ చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్, కర్నాటి ఆంజనేయ రెడ్డి పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ, జడ్పీ వేదికగా ప్రజా సమస్యలపై జడ్పీటీసీలు, ఎంపీపీలు పనిచేయాలని సూచించారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి. గ్రామాల్లో ప్రజలు మీ దృష్టికి తెచ్చిన సమస్యలను స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లాలి, జడ్పీ వేదికగా సమస్యలపై చర్చించాలి.
2029 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలి
అధికారంలో ఉన్నాం ప్రస్తుతానికి ఇబ్బంది లేదని ఏమరుపాటు వద్దు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు పనిచేయాలి. జిల్లావ్యాప్తంగా 35 జడ్పీటీసీ స్థానాల్లో 33 గెలిచాం. సైదాపురం, వింజమూరు స్థానాల్లో ఓడిన అభ్యర్థులకు పార్టీ తగు ప్రాధాన్యత కల్పిస్తుంది.
వైస్ ఛైర్మన్ ఎంపికపై వివరణ
ఎస్సీ సామాజిక వర్గానికి తగు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో మనుబోలు జడ్పీటీసీ పొట్టేళ్ల ప్రసాద్ కు జడ్పీ వైస్ ఛైర్మన్ గా పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. కూటమి పార్టీ జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, సీనియర్ టీడీపీ నేతలు సమిష్టిగా పనిచేశారు. నియోజకవర్గాల సమస్యలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ జడ్పీటీసీల గెలుపుకు బాటలు వేశారు.







