విడపనకలు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 25
విడపనకల్లు మండలంలోని మల్లాపురం గ్రామంలో బోధకాలు వ్యాధి నిర్ధారణ కోసం ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సి. మనోజ్, సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మస్రత్ జః పర్యవేక్షణలో ఈ సర్వే జరిగింది. ఈ సందర్భంగా 312 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.
విడపనకల్లు మండలంలోని మల్లాపురం గ్రామంలో, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సి. మనోజ్ ఆధ్వర్యంలో, ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి, విడపనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మస్రత్ జః సమక్షంలో, సర్వే గ్రామంలో బోధకాల వ్యాధి నిర్ధారణ కోసం ఇంటింటికి తిరిగి 312 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రాత్రిపూట రక్త నమూనాలను సేకరించడానికి విడపనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆరు బృందాలుగా విడిపోయి, ఒక్కో బృందం 50 నమూనాల చొప్పున మొత్తం 312 రక్త నమూనాలను సేకరించారు. మల్లాపురం గ్రామంలో బోధకాలు వ్యాధి నిర్ధారణ కోసం గ్రామస్తులకు అవగాహన కల్పించి, సాయంత్రం నుంచి రాత్రి వరకు రక్త నమూనాలను సేకరించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, మెదడువాపు, బోధకాలు వంటి సీజనల్ వ్యాధుల నివారణ చర్యల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా కోదండరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాధిలో కాళ్ల పరిమాణం క్రమంగా పెరగడంతోపాటు జ్వరం, చలి వంటి లక్షణాలు రోగిలో కనిపిస్తాయని ఆయన తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించి, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిలవకుండా చూసుకోవాలని, నీటి తొట్టెలు, డ్రమ్ములకు తప్పక మూతలు పెట్టాలని సూచించారు. దోమల నివాస ప్రాంతాలను సకాలంలో గుర్తించి, వాటిని పూర్తిగా నిర్మూలించాలని, దోమలు కుట్టకుండా సాయంత్రం పూట వేపాకు పొగతో పాటు రాత్రిపూట తప్పక దోమ తెరలు వాడాలని కోదండరామిరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు చిన్న కంబయ్య, అమృతలత; హెల్త్ అసిస్టెంట్లు నూరు మహమ్మద్, శివరామ కృష్ణారావు; ల్యాబ్ టెక్నీషియన్ షేక్ నూర్ భాషా; శారద; లు శివలక్ష్మి, హేమలత, జ్యోతి, నాగమ్మ; ఆశా కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







