కడప, 2026-11-23
పోరుమామిళ్ల సర్పంచ్ అభ్యర్థి షేక్ సునీషాకు మద్దతుగా బద్వేల్ వైఎస్సార్సీపీ అదనపు సమన్వయకర్త నెల్లూరు విశ్వనాథ రెడ్డి దమ్మునపల్లిలో ప్రచారం నిర్వహించారు.
పోరుమామిళ్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి షేక్ సునీషాకు మద్దతుగా బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అదనపు సమన్వయకర్త నెల్లూరు విశ్వనాథ రెడ్డి దమ్మునపల్లి గ్రామంలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలను కలుసుకొని షేక్ సునీషాకు మద్దతు తెలియజేయాలని కోరారు. పోరుమామిళ్ల గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న షేక్ సునీషాకు ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
గ్రామ అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు షేక్ సునీషాకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 26వ తేదీన జరిగే పోలింగ్లో బ్యాలెట్ పేపర్లో 6వ నంబరులో ఉన్న కప్పు సాసర్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి షేక్ సునీషాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నెల్లూరు విశ్వనాథ రెడ్డి ప్రజలను కోరారు.
మీ ఓటు.. మీ గ్రామ భవిష్యత్తుకు పునాది. గ్రామ అభివృద్ధి కోసం సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







