తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న మినీ బస్సు లోయలో పడి ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
సవరక్కాడు సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని వెలికితీసి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోయలో పడిన బస్సును వెలికితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






