యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయనగరం రీజినల్ ఆఫీస్ ఆధ్వర్యంలో గురువారం కంటోన్మెంట్ శాఖ (R&B జంక్షన్) వద్ద ‘కార్ కార్నివాల్’ (కార్ లోన్ మేళా) నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని బ్యాంక్ జనరల్ మేనేజర్ ఎస్ కె దాస్ మరియు రీజినల్ మేనేజర్ జితేంద్ర శర్మ ప్రారంభించారు.
ఈ సందర్భంగా, యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ ఎస్ కె దాస్ మాట్లాడుతూ, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో వాహన రుణాలను అందిస్తూ సామాన్యులకు కారు కలని నిజం చేస్తున్నామని తెలిపారు. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా త్వరితగతిన రుణాలను మంజూరు చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
రీజినల్ మేనేజర్ జితేంద్ర శర్మ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా యూనియన్ బ్యాంక్ అందిస్తున్న వాహన రుణ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్నివాల్ వేదికగా కొత్తగా వాహన రుణాలు పొందిన పలువురు ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు రుణ మంజూరు పత్రాలను, కారు తాళాలను అందజేశారు.
రుణాలు పొందిన ఖాతాదారులు బ్యాంక్ అందిస్తున్న వేగవంతమైన సేవలకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ బ్యాంకు శాఖల మేనేజర్లు, రీజినల్ ఆఫీసు ఉన్నత అధికారులు, బ్యాంక్ సిబ్బంది, వాహన డీలర్లు మరియు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు పాల్గొన్నారు.


