ఏలూరు, జూలై 20
మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ రాజమండ్రిలోని మంజీరా సరోవర్ ప్రీమియర్లో సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఈ సభలో ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్) పాల్గొన్నారు. ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించిన ఆయన, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ రాజమండ్రిలోని మంజీరా సరోవర్ ప్రీమియర్లో సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఈ సభలో ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్) పాల్గొన్నారు.
ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించిన దూలం నాగేశ్వరరావు, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో దూలం నాగేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖ వైఎస్సార్సీపీ నాయకులు కూడా పాల్గొని నివాళులర్పించారు. వీరిలో కైకలూరు మండల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాంబాబు (రాము), కైకలూరు టౌన్ పార్టీ అధ్యక్షులు సమయం రామాంజనేయులు (అంజి), జిల్లా పంచాయతీ రాజ్ విలపాక కార్యదర్శి బొబ్బిలి రత్తయ్య నాయుడు, జిల్లా రైతు విభాగ కార్యదర్శి శాఖమూరి అమర్ రాజ్, జిల్లా బూత్ కమిటీ కార్యదర్శి పంజా నాగు, కైకలూరు మండల పార్టీ ఉపాధ్యక్షులు పెంట అనిల్ కుమార్ ఉన్నారు.
అలాగే సుంకర శివ, బోను ప్రకాష్, గంటా మురళి, దొండపాటి వినయ్, ఈతకోట శీను తదితర నాయకులు హాజరై ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించారు.












