ఏలూరు, 2026-07-16
ముదినేపల్లి మండలం MPP మరియు YSRCP పార్టీ నాయకులు రామిశెట్టి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ముదినేపల్లి మండలం MPP మరియు YSRCP పార్టీ నాయకులు రామిశెట్టి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముదినేపల్లిలోని ఆయన నివాసంలో అభిమానులు, కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలదండలు, శాలువాలతో రామిశెట్టి సత్యనారాయణను సత్కరించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ తామరకొల్లు మథర్ థెరిస్సా వృధాశ్రమంలో పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.
అనంతరం వృధాశ్రమంలోని వృద్ధులకు స్వీట్లు, భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామిశెట్టి మాట్లాడుతూ, తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.











